Back to FeedQuickToday Shorts

Andhra Pradesh
Aug 30, 2026Short Read
వైసీపీపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు: బలవంతపు మతమార్పిడులపై ఫైర్
గత వైసీపీ ప్రభుత్వంలో బలవంతపు మతమార్పిడులు జరిగాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు.
గన్నవరంలో జరిగిన ఓ సభలో ఆయన మాట్లాడుతూ..
ఓ మాజీ మంత్రి కోడలు తనను మతం మార్చే ప్రయత్నం చేశారని చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు.
బయట హిందువులుగా ఉంటూనే లోపల మతమార్పిడులకు పాల్పడ్డారని విమర్శించారు.
మత విశ్వాసాలు ఉండటం తప్పు కాదని, కానీ బలవంతపు మార్పిడి సరికాదన్నారు.
వైసీపీలో ఉండాలంటే మతం మారాల్సిన పరిస్థితి కల్పించారని, అలాగే దేవాలయాలపై దాడులు చేసి వాటి ప్రతిష్టను దిగజార్చారని చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.





